Pawan Kalyan: కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీదే- పవన్ కల్యాణ్

X
Pawan Kalyan: కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీదేనన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయమన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించలేదన్నారు. కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించడానికి వైసీపీ చేసిన తప్పులే కారణమని విమర్శించారు. రైతులకు దాదాపు 475 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. పంట విరామం ప్రకటించిన రైతులపై.. వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
