AP : జగన్‌ను నిందించట్లేదు.. కానీ టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగింది: పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ వ్యవహారంలో తాను మాజీ సీఎం జగన్‌ను నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి. లడ్డూ వ్యవహారంలో దోషులను శిక్షించమని చెప్పాలి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. 11 రోజులు పాటు ప్రత్యేకంగా ప్రాయిశ్చిత దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఈ రోజు.. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ మెట్లను పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. అంతేకాకుండా.. మెట్లకు పసుసు, కుంకుమ బోట్లు సైతం పెట్టారు. ఆతర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం మరువకముందే తాజాగా లడ్డూలో పొగాకు రావడం భక్తులను కలవరపెడుతోంది. ఖమ్మం(D) గొల్లగూడెంలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో ఓ కుటుంబం ఇటీవల తిరుపతికి వెళ్లొచ్చింది. పంచేందుకు లడ్డూ బయటకు తీయగా అందులో పొగాకు పొట్లం రావడంతో షాకయ్యారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత పాటించడం లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని వారు కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com