PAWAN: మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి

ఆంధ్రప్రదేశ్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ చదువుతుండగా.. ఆ స్కూల్‌లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పవన్ తనయుడు ‘మార్క్ శంకర్’ కాళ్ళు, చేతులకు గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దట్టమైన పొగ కారణంగా లంగ్స్ లోకి పొగ వెళ్లగా తీవ్ర ఇబ్బందులకు గురవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ బయల్దేరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది.సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’అని రాసుకొచ్చారు.
నారా లోకేశ్ ట్వీట్
మరోవైపు నారా లోకేష్ కూడా ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవ్వాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన ముగిశాక, కురిడి టెంపుల్, దంబ్రిగూడలోని జనాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నాక సింగపూర్ కు బయల్దేరుతున్నారు. ఇక మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10న అన్నా లెజినోవాకు జన్మించారు.
స్పందించిన జగన్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సింగపూర్ స్కూల్ ప్రమాదంలో పవన్ కల్యాణ్‌గారి తనయుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com