Anna Canteens : అన్న క్యాంటీన్లకు ప్రజలు విరాళాలివ్వాలి: సీఎం చంద్రబాబు
దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం’ అని తెలిపారు.
ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గుడివాడలో నేడు సీఎం చంద్రబాబు తొలి క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. మిగతా 99 క్యాంటీన్లను రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓపెన్ చేస్తారు. వీటి ద్వారా రోజుకు సుమారు 1.05 లక్షల మందికి ఆహారం అందిస్తారు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం అందిస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. ఉ.7.30 గంటల నుంచి రాత్రి 9 వరకు తెరిచే ఉంటాయి.
2014-19 మధ్య ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయని దుయ్యబట్టారు. విజయవాడలో మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేశారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు’ అని మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com