Andhra Pradesh: మున్సిపాలిటీ పన్నులు కడతారా చస్తారా.? వైసీపీ తీరుపై ప్రజల ఆరోపణ..

Andhra Pradesh: ఏపీలో వైసీపీ ప్రభుత్వ దాష్టికాలకు అంతులేకుండా పోతుందని జనం ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు కాకినాడ కార్పోరేషన్ పన్నులు చెల్లించకపోతే ఇంట్లోని సమానులు పట్టుకుపోతాం అంటూ వాహనాలపై బ్యానర్లతో హల్‌చల్ చేసిన అధికారులు.... కాకినాడ సమీపంలోని పిఠాపురం మున్సిపాల్టీలో ఏకంగా ఇళ్లలో మహిళలను ఉంచి బయట గేట్లకు తాళాలువేయడం సంచలనం కల్గిస్తోంది.
ఇళ్లపన్నుల వసూళ్లలో వాలెంటీర్ల సహాయంతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పిఠాపురం పట్టణంలోని 15వ వార్డులో ఇంటిపన్నులు చెల్లించలేదన్న కారణంగా ఇళ్లకు తాళాలువేశారు. పన్నులు చెల్లించకపోతే నెలవారి వచ్చె పెన్షన్లలో కూడా కోత విధిస్తామని అధికారులు,సచివాలయ సిబ్బంది బెదరిస్తున్నారని వారు వాపోతున్నారు.
అధికారులు పన్నులు వసూలు చేసే తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం జెండాలు కనిపించిన ప్రాంతాల్లో వైసీసీ నేతల ప్రోద్భలంతో అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com