చంద్రబాబు తిరుపతి టూర్‌కి అనుమతి ఇస్తారా..? లేదా..?.. ఇప్పటికే వెళ్లిపోయిన స్పైస్‌జెట్, ఇండిగో విమానాలు..!
తిరుపతి రేణిగుంట విమానశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబును బలవంతంగా హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ట్రూజెట్ ఇండిగో, స్పేస్ జెట్ విమనాల్లో చంద్రబాబుకు టికెట్లు బుక్ చేశారు. ఇప్పటికే స్పేస్ జెట్ వెళ్లిపోగా ఇండిగో విమానం రన్‌వేపై సిద్ధంగా ఉంది. అటు.. ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లబోనంటూ భీష్మించిన చంద్రబాబు.. నేలపైనే కూర్చుని నిరసన కొనసాగిస్తున్నారు.
ట్రూజెట్ విమానంలోనూ పోలీసులు టికెట్ బుక్ చేశారు. చంద్రబాబును ఎలాగైనా హైదరాబాద్ పంపించాలని పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. రేణిగుంట విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు నిర్బంధం ఆరు గంటలుగా కొనసాగుతోంది. చంద్రబాబుతో ఎస్పీ పలు విడతలుగా చర్చలు జరిపినా... చంద్రబాబు ఆందోళన విరమించేందుకు నిరాకరించారు. బిస్కెట్లు ఇచ్చి దీక్ష విరమించాలని ఎస్పీ కోరారు. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు అనుమతించాలని చంద్రబాబు అన్నారు. ఇందుకు పోలీసులు నిరాకరించారు. ఆందోళనకు అనుమతిస్తేనే దీక్ష విరమిస్తానని చంద్రబాబు తేల్చిచెప్పారు.
అటు పోలీసుల తీరుకు నిరసనగా ఆరు గంటలుగా చంద్రబాబు మంచినీళ్లు కూడా తాగకుండా ఆందోళన చేస్తున్నారు. నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేయడానికి సైతం నిరాకరించారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జిల్లా ఎస్పీ... చంద్రబాబుతో చర్చించారు. తనను ఎందుకు అడ్డగించారని చంద్రబాబు ఎస్పీని ప్రశ్నించారు. తిరుపతి పర్యటనకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే... ఎస్పీ మాత్రం.... చంద్రబాబును హైదరాబాద్ పంపాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com