TDP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్..

X
TDP (tv5news.in)
TDP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఆఫీస్‌పై దాడికి సంబంధించి మరో వీడియోను టీడీపీ విడుదల చేసింది.
అటు.. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసులోనూ ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరంతా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వారిగా గుర్తించారు. ఇంకొందరిని అరెస్టు చేయకపోవడం, నిందితులుగా గుర్తించకపోవడం అనుమానాలకు దారి తీస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
