Kuppam: కుప్పంలో అర్థరాత్రి ఉద్రిక్తత.. ఇద్దరు టీడీపీ నేతల అరెస్ట్..

Kuppam (tv5news.in)
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్న మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఘటనలో.. పోలీసులు టీడీపీ నేతలు అమర్ నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని అరెస్టు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిని పలమనేరు పోలీస్టేషన్‌కు తరలిస్తున్నారన్న సమాచారంతో వీకోట, పలమనేరు జాతీయ రహదారిని దిగ్బందించారు. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ఘటనలో అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తినానితోపాటు 19మందిపై పోలీసులు కేసునమోదు చేశారు.
కుప్పంలోని ఓ ప్రైవేటు హోటల్లో బస చేసిన అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నానిని అరెస్టుచేయడంతో టీడీపీ కార్యకర్తలు మొదట హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి అరెస్టులు ఏంటని పోలీసులను నిలదీశారు. అరెస్టువిషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున అక్కడికిచేరుకొని నిరసన చేపట్టారు. అనంతరం పలమనేరు జాతీయరహదారిపై నిరసన చేపట్టారు. తమ నేతలను విడిచిపెట్టేంతవరకు లేచేదిలేదంటూ రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మొన్న మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అమర్ నాథ్‌రెడ్డి, పులివర్తి నానితోపాటు మరికొందరిపై కేసునమోదు చేశారు. దీనిలో భాగంగా రాత్రి బసచేస్తున్న హోటల్‌కు పెద్దసంఖ్యలో వచ్చిన పోలీసులు... ఇద్దరునేతలను అరెస్టుచేయడం తీవ్రకలకలం రేపింది. అర్ధరాత్రి అరెస్టులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎస్‌ఈసీకి లేఖరాశారు. అక్రమ అరెస్టులను నిలువరించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com