Pattabhi Ram: పట్టాభి ఇంటి వద్ద పోలీసుల హడావుడి.. కదలికలను గమనిస్తూ..
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పట్టాభికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల క్రితం కూడా 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఉండడంతో.. పోలీసులు వెనక్కి తగ్గారు. మళ్లీ నిన్న రాత్రి నుంచి పట్టాభి ఇంటి వద్ద పోలీసుల హడావుడి కనిపిస్తోంది. రాత్రి నుంచి పట్టాభి నివాసం వద్ద అదనపు పోలీసులను మోహరించారు. పట్టాభి కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
Next Story