AP : శ్రీకాకుళంలో రాజకీయ కక్ష.. నిండు ప్రాణం బలి

AP : శ్రీకాకుళంలో రాజకీయ కక్ష.. నిండు ప్రాణం బలి
X

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కక్షలు కట్టలు తెచ్చుకుంటున్నాయి. క్షణికావేశంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. ఎన్నికలు ముగిసినా, రాజకీయాలు సద్దుమణిగినా ఆ ఊర్లో మాత్రం ఇంకా కక్షలు నివురుగప్పిన నిప్పులా భగభగ మంటూనే ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలోని వన విష్ణుపురం గ్రామంలో రాత్రి గొడవ జరిగింది. గ్రామంలో అమ్మవారి వారాల పండుగ జరుగుతున్న సందర్భంగా రాజకీయ కారణాలతో తెలుగుదేశం వైసీపీ వర్గీయులు వేరువేరుగా అమ్మవారి వారాల పండుగలు నిర్వహించాల్సి ఉంది. ఉత్సవాలలో భాగంగా వేప కొమ్మల వేటకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఘర్షణ తలెత్తింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఒక్కసారిగా కర్రలు కత్తులతో ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పాలిన వీరస్వామి మృతి చెందగా... మరికొంతమంది క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

Tags

Next Story