AP : ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్టులు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

AP : ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్టులు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
X

ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తున్నారు. వివిధ సర్వేల్లో నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు వెల్లడించిన అభిప్రాయాన్ని సేకరించి నివేదికలు రూపొందించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ను బట్టి రోజుకు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం కానున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

అదేవిధంగా అమలు చేసిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఇప్పటికే సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని చెప్పారు. పార్టీ బలోపేతం, సమస్యలు వాటి పరిష్కారాలు, పార్టీ పదవులకు సంబంధించి అంశాలను ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

Tags

Next Story