AP PROTEST: పర్వదినం రోజునా "పోరుబాటే"

AP PROTEST:  పర్వదినం రోజునా పోరుబాటే
వినాయకచవితి రోజున కొనసాగిన ఆందోళనలు... నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రత్యేక పూజలు...

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పండుగ రోజునా ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు విడుదలైన రోజే తమకు అసలైన పండగంటూ ప్రజలు వ్యాఖ్యానించారు. వినాయకచవితి రోజునా ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు మిన్నంటాయి. చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి విడుదల కావాలని ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, వియ్యపురాలు వసుంధర నఇతర కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నాలాం భీమరాజు వీధిలోని శ్రీసిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరి విద్యానగర్‌లోని దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు.

కృష్ణా జిల్లాలోని కంకిపాడు శివాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజు కొనసాగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమ... దీక్షల్లో పాల్గొన్నారు. చంద్రబాబు జైలు నుంచి త్వరలోనే విడుదల కావాలని నందిగామ రైతులు వినాయకునికి పూజలు నిర్వహించారు. ప్రభుత్వ కుట్రల్ని ఛేదించుకొని చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని కాంక్షిస్తూ మంగళగిరిలో రాజధాని రైతులు, తెలుగుదేశం నేతలు దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు మండలం మందడంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో. రిలే నిరాహార దీక్షల్లో ముస్లింలు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు.


అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గణేష్‌ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాయకరావుపేటలో ఆటోడ్రైవర్లు వినాయక పందిళ్ల వద్ద పూజలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం, మైనార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. విజయనగరం సిటీ బస్టాండ్‌ వద్ద వరసిద్ధి వినాయక ఆలయంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో మాజీ MLA బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. సామూహిక దీక్షల్లో ముస్లింలు, క్రైస్తవులు పాల్గొని. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ రాజోలులో వినాయకుడికి పూజలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల నిరసన దీక్షలు కొనసాగాయి. పాలకొల్లు గాంధీబొమ్మ కూడలిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి.

Tags

Read MoreRead Less
Next Story