కొనసాగుతున్న ఆందోళనల పర్వం

కొనసాగుతున్న ఆందోళనల పర్వం
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కాలని పూజలు... టీడీపీ శ్రేణుల దీక్షలు..

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో బాబుకు ఊరట లభించాలంటూ ప్రార్థనలు నిర్వహించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బాబుతోనే మేమంటూ టీడీపీ నేతలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. రాజాంలోని టీడీపీ కార్యాలయం వద్ద చెరసాలలో ఉన్నట్లుగా రిలే నిరాహార దీక్షను చేపట్టారు. అనకాపల్లి జిల్లా పూడిమడక సాగర తీరంలో జలదీక్ష చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను చెతన్య పరిచారు. కాకినాడలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో GVMC కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.


కర్నూలు జిల్లా కోడుమూరులో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలతో కూడిన పుస్తకాలను ప్రదర్శించారు. ఆదోనిలోని 30 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కర్నూలులో వినూత్నంగా న్యాయం కావాలంటూ భిక్షాటన చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ.. దర్గాలో ముస్లిం సోదరులు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాబు విడుదల కావాలంటూ గట్టిపాటి రవికూమర్‌ చేపట్టిన సైకిల్‌ యాత్ర సంతమాగులూరు నుంచి సజ్జాపురం వరకు సాగింది. పర్చూరు దర్గాలో ముస్లిం సోదరులు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప జిల్లా పెద్ద దర్గాలో పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా నాగిరెడ్డిపల్లిలో పోలేరమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో అమరావతి రాజధాని దీక్షా శిబిరం వద్ద మెడకు ఉరితాళ్లు వేసుకొని... మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తెదేపా నాయకులు బాబుతో నేను.. కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికి వెళ్లి ప్రజలను చైత్యం పరిచారు.

పాలకొల్లులో MLA నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిబిరంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ధర్నా చేశారు. న్యాయం గెలవాలి ధర్మం నిలవాలంటూ మౌనదీక్ష చేపట్టారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ ఎమ్మిగనూరు గద్దెరాళ్ల మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టారు. బాబుకు బాసటగా కరపత్రాలు ప్రదర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story