ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఊరట.. !

ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఊరట.. !
ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా అరెస్ట్‌ చేయకూడదంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా అరెస్ట్‌ చేయకూడదంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. సొంత నియోజకవర్గానికి రాకుండా తనను అడ్డుకుంటున్నారని, ఉద్దేశపూర్వకంగా అక్రమకేసులు పెట్టారంటూ.. రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ.... పిటీషన్‌ లో కోరారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు... ఆయన్ను అరెస్ట్‌ చేయకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Tags

Next Story