Raghu Rama Krishna Raju: రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు..విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ

నరసాపురం మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
సీబీఐ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామరాజు ఇటీవల గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని నగరపాలెం పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం గత నెలలో హైకోర్టును ఆశ్రయించగా విజయ్‌పాల్‌కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా, తనపై నమోదైన కేసును కొట్టవేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com