AP Assembly : రఘురామ రాకతో ఏపీ అసెంబ్లీలో పండగ..బాబు, పవన్ ఫుల్ హ్యాపీ

AP Assembly : రఘురామ రాకతో ఏపీ అసెంబ్లీలో పండగ..బాబు, పవన్ ఫుల్ హ్యాపీ
X

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘు రామ కృష్ణం రాజు ఏకగ్రీవంగా ఎన్నికై పదవిని స్వీకరించడంతో ఏపీ అసెంబ్లీలో సంతోషాలు వెల్లివిరిశాయి. 11 మంది అక్కడ.. 164 మంది ఇక్కడ ఉన్నారనేందుకు ఓ నిలువుటద్దం RRR అని చంద్రబాబు, పవన్ కొనియాడారు. రఘురామ కృష్ణం రాజు ఓ నాటు పాట లాంటి సంచలనం అని.. ఆయన పోరాటం అందరికీ స్ఫూర్తి దాయకం అని అన్నారు. గత ఐదేళ్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ టెర్రరిజమ్‌ జరిగిందన్నారు చంద్రబాబు. సొంత పార్టీ ఎంపీపైనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రఘురామకృష్ణరాజుపై కక్షగట్టి..పుట్టిన రోజే అరెస్ట్‌ చేశారన్నారు. సొంత ఎంపీని వేధించిన ఘటన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం రఘురామను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని పవన్‌ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే ఎదురుదాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో క్రిమినల్‌ పాలిటిక్స్ ఉండకూదని తెలిపారు. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు పవన్.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా గురువారం రఘురామకృష్ణ రాజు బాధ్యతలు చేపట్టారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రఘురామకృష్ణ రాజును స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, అయ్యన్నపాత్రుడు అభినందించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags

Next Story