న్యాయవ్యవస్థపై దాడులకు ఎనిమిదేళ్ల కిందటే బీజం.. రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు

న్యాయవ్యవస్థపై దాడులకు ఎనిమిదేళ్ల కిందటే బీజం పడిందని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ,అప్పుడు, ఇప్పుడూ జస్టిస్ ఎన్వీ రమణనే జగన్ టార్గెట్ చేస్తూ వచ్చారని ఎంపీ అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఎం.మనోహర్ రెడ్డి అనే ప్రముఖ న్యాయవాది మరో లాయర్ తో కలిసి అప్పటి హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై అబద్దాలతో కూడిన ఆరోపణలు చేశారన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్.. సుప్రీం జడ్జిపై ఇంత పెద్ద స్థాయిలో అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు.
హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఏపీ సీఎం చేసిన ఫిర్యాదులపై దేశమంతా చర్చిస్తోందన్నారు ఎంపీ రఘురామ. ఒక ప్రణాళికతో కావాలనే దాడి చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నో నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఇలా మాట్లాడటం అసమంజసంగా ఉంటుందన్నారు. సీఎం జగన్ పై కేసులన్నీ అడ్మిట్ అయితే ఏపీ సీఎం పరిస్థితి ఏమవుతుందో చూడాలన్నారు.