Rain Forecast : నేడు రాయలసీమకు వర్షసూచన

Rain Forecast : నేడు రాయలసీమకు వర్షసూచన
X

ఏపీలో నేడు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఆస్కారం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వర్షాల కారణంగా రాయలసీమలో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో 2-3డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది.

ఇక తమిళనాడులోని కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో చెన్నై వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. తూర్పు గాలుల వేగంలో మార్పులకు గురికావడంతో కోస్తా తమిళనాడులోని కొన్ని చోట్ల, తమిళనాడులోని ఒకటి రెండు చోట్ల, పుదుచ్చేరి, కారైకల్‌లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

మార్చి 2న దక్షిణ తమిళనాడులోని కొన్ని చోట్ల, ఉత్తర తమిళనాడులోని ఒకటి రెండు చోట్ల, పుదుచ్చేరి, కారైకల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మార్చి 3న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags

Next Story