AP Rainfall : నేటి నుంచి ఏపీలో వర్షాలు

AP Rainfall : నేటి నుంచి ఏపీలో వర్షాలు
X

నేటి నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ మోస్తరు వర్షాలు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు తెలంగాణలో కూడా ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో వైపు ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వచ్చే నెల 3న వడగండ్లు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.

Tags

Next Story