రామతీర్థంలో వైసీపీ ఓవరాక్షన్‌పై టీడీపీ రియాక్షన్

చంద్రబాబు రామతీర్థం వెళ్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని నిలదీశారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. 18 నెలల పాలనలో 140 దేవాలయాలపై దాడులు జరిగితే చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిపక్షంపై నాడు ఇదే కక్ష చూపించి ఉంటే జగన్ మూడు మీటర్లు కూడా నడిచి ఉండే వారు కాదన్నారు. భద్రత కల్పించాల్సిన డీజీపీయే సెక్యూరిటీ కాన్వాయ్‌ని అనుమతించకపోవడాన్ని రామానాయుడు తప్పుపట్టారు.
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసానికి కారకులైన వైసీపీ నేతలు మళ్లీ పర్యటనల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు.. రామభక్తులు ఆక్షేపించినా పోలీసులే దగ్గరుండి వైసీపీ నేతలను తీసుకెళ్లగడం సిగ్గు చేటన్నారు. ఆలయాలు, రథాలు, విగ్రహాల ధ్వంసాలను హిందువులే కాదు, ఏ మతం వారూ సమర్థించడం లేదన్నారు. తీరు మార్చుకోకుంటే వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని సోమిరెడ్డి హెచ్చరించారు.
మరోవైపు రామతీర్థంలో చంద్రబాబు పర్యటనపై సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. మూడు ప్రముఖ దేవస్థానాల ధర్మకర్త హోదా నుంచి మాజీమంత్రి, విజయనగరం రాజవంశీకుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించింది. రామతీర్థం రామాలయం, విజయనగరం పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతిరాజును తొలగించింది. ఆయనకు ఈ హోదా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ దేవదాయశాఖ మెమో ఇచ్చింది. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తోన్న వైసీపీ సర్కారుపై మండిపడింది తెలంగాణ బజరంగ్‌దళ్. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు చేయిస్తోన్న జగన్ ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదంటూ ఫైర్ అయ్యారు బజరంగ్‌దళ్ నేతలు. సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బజరంగ్‌దళ్ నేతలు. హిందూ భక్తులపై రక్షణ కల్పించాల్సిన పోలీసులే దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com