న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు : రామ్మోహన్‌

న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు : రామ్మోహన్‌
X

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక.. అన్ని వ్యవస్థలను బెదిరించి తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ ను సైతం బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వారికి అనుకూలంగా కోర్టులు తీర్పులు వచ్చినప్పుడు అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసే మీ పార్టీ పేరు కూడా వైఎస్సార్ పేరు తీసి చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకోండన్నారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై చర్చించాల్సిన పోయి వ్యక్తిగత అంశాలను తీసుకురావడం వారి దుర్మార్గపు ఆలోచన తెలుపుతుందన్నారు.

Tags

Next Story