AP : ఇద్దరు ఏపీ చిన్నారుల్లో అరుదైన వ్యాధి

AP : ఇద్దరు ఏపీ చిన్నారుల్లో అరుదైన వ్యాధి
X

పంజాబ్‌లో మాత్రమే కనిపించే సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే అరుదైన వ్యాధిని పల్నాడుకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు GGH సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. ‘వెల్దుర్తి మండలం నుంచి ఇద్దరు పిల్లలు ఎనీమియాతో ఆస్పత్రికి వచ్చారు. వారికి పరీక్ష చేయగా ఈ వ్యాధి బయటపడింది. దీనికి ఎముక మజ్జ మార్పిడే పరిష్కారం. ఈ వ్యాధి గుర్తించిన చోట పిల్లలకు రక్త పరీక్షలు చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

ఈ చికిత్స ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదు. తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుంది’ అని కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ వ్యాధి గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పెథాలజీ విభాగం అధిపతి అపర్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం సహకరిస్తే శ్రీరాంపురం తండాలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఇతర పిల్లల్లో కూడా ఈ వేరియంట్‌ ఉందేమో గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Tags

Next Story