Chittoor: చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం..

Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. చంద్రగిరి మండలం మామండూరు దగ్గర తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. కృష్ణ పట్నం పోర్టు నుంచి సిమెంటు బస్తాల లోడుతో తమిళనాడులోని జోలార్‌పేటకు లారీ వెళ్తోంది..
విశాఖ నుంచి గోల్డెన్ టెంపుల్ సందర్శన కోసం ఓ కుటుంబం కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.. మృతుల్లో రెండేళ్ల చిన్నారితోపాటు ఓ మహిళ ఉన్నారు.. డ్రైవర్ సీటులోని వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.. కారులోని మృతదేహాలను బయటకు తీశారు.. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com