RUSHIKONDA: రుషికొండ ప్యాలెస్‌పై దిగ్గజ సంస్థల కన్ను

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్యాలెస్ ను లీజుకు తీసుకోవడానికి ముందుకొస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ అయ్యింది. సబ్ సంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. మంత్రి డీఎస్‌బీవీ స్వామి, అధికారులు వర్చువల్ గా భేటీకి హాజరయ్యారు. టాటా, లీలా గ్రూప్ వంటి పలు ప్రముఖ దిగ్గ సంస్థలు ప్యాలెస్ వినియోగానికి ముందుకొచ్చిన అంశంపై సమావేశంలో చర్చించారు. టూరిజం సహా పలురకాల వినియోగానికి సదరు సంస్థలు డీపీఆర్ ఇచ్చినట్లు మంత్రులు పేర్కొన్నారు. సంస్థలు ఇచ్చిన డీపీఆర్ లపై కేబినేట్ సబ్ కమిటీ లోతైన విశ్లేషణ చేసింది. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై కూడా చర్చించింది. మరోసారి ఎల్లుండి సమావేశం కావాలని తీర్మానించింది. రుషి కొండ ప్యాలెస్ ను అందమైన హోటల్ గా మార్చగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
రుషి కొండపై ఉన్న ఈ కట్టడాలను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు దేశీయ, అంతర్జాతీయ హోటల్ గ్రూపుల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్‌గ్రూప్‌అట్మాస్పియర్ కోర్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్యాలస్‌ను లగ్జరీ హోటళ్లుగా మార్చేందుకు ముందుకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనల్లో ఒక చిన్న మెలిక ఉంది. కొన్ని సంస్థలు హోటల్ నిర్వహణకు అదనపు స్థలం కావాలని కోరుతుండటం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. రుషికొండ ప్యాలస్ పూర్తిగా ప్రైవేటు సంస్థలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రుషి కొండలోని చివరి రెండు బ్లాక్‌లను ప్రజల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, పర్యాటకుల అవసరాల కోసం ప్రత్యేకించనున్నట్టు మంత్రి పయ్యావుల తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న భవనాలపై అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించే సాంకేతిక అవకాశం ఉందని దీనిపై చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

