Sajjala Ramakrishna Reddy : రేపు మధ్యాహ్నానికి కొత్త మంత్రుల తుది జాబితా : సజ్జల

Sajjala Ramakrishna Reddy : రేపు మధ్యాహ్నానికి కొత్త మంత్రుల తుది జాబితా సిద్ధమవుతుందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పాత మంత్రుల రాజీనామాలను గవర్నర్‌కు పంపుతామన్నారు. పాత కేబినెట్‌లోని మంత్రులు కొత్త కేబినెట్‌లో ఉంటే.. మళ్లీ కొత్తగా ప్రమాణం చేయాల్సిందేనన్నారు. పాత మంత్రులు ఐదుగురు కొనసాగుతారో.. 12 మంది కొనసాగుతారో.. ఇప్పుడే చెప్పలేం.. కసరత్తు కొనసాగుతోందని సజ్జల స్పష్టం చేశారు. లాస్ట్ మినిట్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మంత్రివర్గ కూర్పుపై జగన్‌దే తుది నిర్ణయన్న సజ్జల.. ఎంపిక చేసిన కొత్త మంత్రులకు సమాచారం తెలియజేస్తామని.. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే.. ఎస్సీలు, బీసీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అటు.. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సజ్జల.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com