Schools Holiday : జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగితే మరో రోజు సెలవు పొడిగించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లోని 4 మండలాల్లోని స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇచ్చారు.
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. ప.గో, తూ.గో, ఏలూరు, కోనసీమ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. కేవలం ఉమ్మడి తూ.గోలోనే సుమారు 65వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరో 20వేల ఎకరాల్లో నారుమళ్లు నీళ్లలోనే ఉన్నాయి. అటు వాగులు పొంగి పొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణలో 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వర్షం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మీరేమంటారు?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com