నాలుగో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

నాలుగో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ZPTC, MPTC స్థానాల్లో ప్రలోభాలు, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వారికి గురువారం ఎన్నికల సంఘం మరో అవకాశం

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జరుగుతున్న వరుస ఉద్రిక్తతల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఈసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. నాలుగో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అధికారుల్ని ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ ‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు.

ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. జనరేటర్లు, ఇన్వెర్టర్ల వంటి ప్రత్యామ్నాయ సదుపాయం సమకూర్చుకోవాలని చెప్పారు. అనుమతి లేని వారిని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి రానివ్వొద్దని స్పష్టంచేశారు. పది లోపు ఓట్ల తేడా ఉన్న చోటే.. రీ కౌంటింగ్‌కు ఆదేశించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో సమాచారం లీక్‌ కాకుండా చూడాలని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజీ భద్రపరచాలని ఎస్‌ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నారు.

మరోవైపు.. గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో మళ్లీ ఎస్‌ఈసీ విచారణ జరపకూడదని.. ఇవ్వనిచోట ఫలితాలు వెల్లడించొద్దని హైకోర్టు.. ఎస్‌ఈసీని ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదంటూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది.

ZPTC, MPTC స్థానాల్లో ప్రలోభాలు, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వారికి గురువారం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేయడం వల్ల.. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్న వ్యవహారాల్ని తమ దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ల ఆధారంగా బాధితులు కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

ZPTC, MPTC నామినేషన్లు, జిల్లాల నివేదికల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ వెల్లడించింది. గతంలో నామినేషన్లను అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లు కూడా సమర్పించాలని పేర్కొంది. ఫిర్యాదులు లేకపోయినా మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ల ఆధారంగా బాధితులు కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ వెల్లడించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టంచేసింది. బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే.. ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. రాజకీయ పార్టీలు, పలువురి విజ్ఞప్తి మేరకు ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఈసీ సరవణలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story