Ayyanna Patrudu: మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్..

Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ యంత్రాంగం తీరుపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులతో అయ్యన్న అనుచరులు, టీడీపీ నేతలు, కార్యర్తలు వాగ్వాదానికి దిగారు. ఇంటి గేటు బయట టీడీపీ శ్రేణులతో కలిసి అయన్నపాత్రుడు కుమారుడు విజయ్ నిరసనకు దిగారు. దాంతో నర్సీపట్నంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, పిలా గోవింద్, కోరాడ రాజబాబుతో పాటు పలువురు నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. మరికొందరు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు.
అటు నర్సీపట్నం ఆర్డీవో గోవిందరాజుకు అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల రాజేష్ మెమోరాండం సమర్పించారు.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రతిపాదన తెచ్చారు.. ఆక్రమణ అని అంటున్న స్థలంలో సర్వే జరిపించాలని.. అది ఆక్రమణ అని తేలితే తామే స్వచ్ఛందంగా తొలగిస్తామని అన్నారు.. పోలీసు బలగాల మోహరింపుతో భయోత్పాతాన్ని తీసుకురావద్దని అయ్యన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు.. అటు జాయింట్ సర్వేపై అధికారులు ఎటూ తేల్చకపోవడంతో హైడ్రామా కొనసాగుతోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com