Road Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

APలోని స‌త్య‌సాయి జిల్లాలో తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డికక్క‌డే న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ప‌ది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గుడిబండ‌, అమ‌రాపురం మండ‌లాల‌కు చెందిన 14 మంది మినీ వ్యాన్‌లో తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో తెల్ల‌వారుజామున.. మ‌డ‌క‌శిర మండ‌లం బుళ్ల‌స‌ముద్రం వ‌ద్ద ఆగి ఉన్న లారీని వారి వాహ‌నం ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్‌లో ప్ర‌యాణిస్తున్న 14 మందిలో న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు. గాయపడిన వారిని బెంగ‌ళూరులోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Tags

Next Story