CM Chandrababu : గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu : గాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారు: సీఎం చంద్రబాబు
X

సంత్ సేవాలాల్ ఏపీలో పుట్టినా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. సచివాలయంలో జరిగిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహాత్మాగాంధీ కంటే ముందే సేవాలాల్ అహింస పాటించారని చెప్పారు. బ్రిటీష్ కాలంలో మతమార్పిడులపై పోరాడారని, ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన అప్పుడే బోధించారని పేర్కొన్నారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణలో గిరిజనులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ 1739 ఫిబ్రవరి 15న ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలోని ఓ మారుమూల తండాలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అప్పట్లోనే దేశమంతటా తిరిగి లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన వారికి ఆరాధ్య దేవుడయ్యాడు. రాజపుత్ర సంతతికి చెందిన గిరిజన జాతుల్లో లంబాడీ జాతికి చెందిన దంపతులకు జన్మించడం వల్ల ఆయనను సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌గా, గిరిజన రాజుగా, లంబాడీ గురువుగా కొలుస్తారు. అప్పట్లోనే నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచిన ఘనత సేవాలాల్‌ మహారాజ్‌ది.

Tags

Next Story