TTD : తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి పార్థసారథి స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని.. ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. విజన్- 2047 స్వర్ణాంధ్ర, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు ఆలోచనలు నెరవేరాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. అదేవిధంగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్వామివారికి దర్శించుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com