AP : కృష్ణా, గుంటూరులో మాటల కందని పంట నష్టం

AP : కృష్ణా, గుంటూరులో మాటల కందని పంట నష్టం

భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఏపీలో వర్షాలకు దాదాపుగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారు అధికారులు. రాష్ట్రంలోని ఇరవైకిపైగా జిల్లాలపై వర్షాల ప్రభావం ఉందని వీటిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. గోదావరి జిల్లాల్లో దాదాపు 30 వేలకుపైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు అన్నదాతలు వాపోతున్నారు.

విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులు అవుతున్నా ఇంకా ముంపు వారిని వీడటం లేదు. ఈ వర్షాలకు సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఇందులో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంట నీటిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

వర్షాల వల్ల ఎకరాకు రూ.15వేల వరకు నష్టం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలా పంటలు దెబ్బతిన్న వారిలో వరి రైతులతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా ఉన్నారు. వేల ఎకరాల్లో పత్తి నీట మునిగింది. వర్షాల వల్ల పంట దెబ్బతినడమే కాకుండా చీడపీడలు కూడా చుట్టుముడతాయని చెబుతున్నారు.

Tags

Next Story