Sharmila Challenges : దమ్ముంటే ఐదేళ్ల వైసీపీ పాలనపై విచారణ జరిపించండి: షర్మిల

గత 5ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ‘ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉంది మీరే కదా? భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఎందుకు బయటపెట్టలేదు? రాజధాని లేకుండా పాలన సాగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ మీరు ఆడించినట్లు ఆడినందుకా? మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి’ అని అమిత్ షాను డిమాండ్ చేశారు.
''సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు ? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా ? 5 ఏళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడు.. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. రాష్ట్రంలో సహజ వనరులను 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే'' అని షర్మిల ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com