AP : ఇవాళ్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

AP : ఇవాళ్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్‌లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, ఆట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది.

జగన్ బస్సు యాత్రకు విరామం

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Tags

Next Story