AP : వైసీపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా

అనంతపురం (Ananthapuram) జిల్లాకు చెందిన మాజీ మంత్రి పామిడి శమంతకమణి, ఆయన కుమారుడు అశోక్ వైసీపీకి (YCP) రాజీనామా చేశారు. ఈ మధ్యే శమంతకమణి కూతురు యామినీబాల.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. ఈ రోజు తన కుమారుడు అశోక్‌తో పాటు వైసీపీకి బైబై చెప్పారు.
శమంతకమణి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఉదయాద్రి మహిళా మండలిని స్థాపించి దాని ద్వారా అనేక సామజిక, సేవ కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసింది. శమంతకమణి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కె.జయరాం చేతిలో 14212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.
1989లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శమంతకమణి రాష్ట్ర విద్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసింది. ఆమె 1989లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరింది. అనంతరం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. టీడీపీకి రాజీనామా చేసి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తమ రాజకీయ భవిష్యత్తుపై వారు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు అనేది వేచాచూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com