Srisailam Dam : తెలంగాణకు షాక్... శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత...

వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ముందుగా కృష్ణమ్మ కు జల హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. అయితే నిన్ననే గేట్ల ఎత్తివేత గురించి అధికారులు ప్రకటించడం తో శ్రీశైలం ఘాట్ రోడ్లు మొత్తం పర్యాటకులతో నిండిపోయాయి. కాగా జూలై మొదటి వారం లోనే డ్యామ్ గేట్లు ఎత్తడం గత పాతికేళ్ల లో ఇదే తొలిసారి..
ఇదిలా ఉండగా డ్యామ్ గేట్ల ఎత్తివేత అంశం గురించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. శ్రీశైలం డ్యామ్ ను ఏపీ నిర్లక్ష్యం చేస్తుందని ఈ సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తరాదని కేంద్రానికి రాసిన లేఖ లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కేంద్రం నుండి ఎలాంటి అబ్జెక్షన్ రాకపోవడం తో గేట్లను ఎత్తి నీటి నీ విడుదల చేశారు అధికారులు.. ఇక ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది అనేది ఉత్కంఠ గా మారింది..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com