కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు.. కూటమి దూకుడు

కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు.. కూటమి దూకుడు
X

కల్తీ మద్యంతో ఏపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కల్తీ మద్యంలో టిడిపి నేతలు ఉన్నారని తెలిసి ఇప్పటికే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకోవట్లేదు అనే ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున తాయిలాలు రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితుల నుంచి ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు నేడు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సీట్ ఏర్పాటు చేశారు.

ఇందులో మరికొందరు కూడా సభ్యులుగా ఉన్నారు. ములకలచెరువులో ఏ విధంగా కల్తీ మద్యం తయారు చేశారు.. దాన్ని ఎక్కడికి సరఫరా చేశారు.. వచ్చిన డబ్బును ఏం చేశారు అనే కోణంలో ఈ విచారణ సాగనుంది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా నుంచి ఏపీకి ఈ కల్తీ మద్యం ప్రాసెస్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో చేసిన కల్తీ మద్యం అక్కడ వేలమంది ప్రాణాలను తీసింది. ఈ రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ వెనుక ఉన్నది జగన్ సోదరులే. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు అనారోగ్యం పేరుతో ఆఫ్రికాకు వెళ్లి నట్టు క్రియేట్ చేశారు. కానీ ఆయన వెళ్ళింది అక్కడ కల్తీ మద్యం ఎలా తయారు చేస్తున్నారు ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి. అక్కడ తెలుసుకున్న ప్రాసెస్ తోనే ములకలచెరువులో అలాంటి చిన్న సైజులోనే కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

తీగ తాగితే డొంక కదిలినట్టు.. ఈ కల్తీ మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు అనేది సిట్ విచారణలో తేలే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు ప్లేస్ లో జగన్ ఉండి ఉంటే.. తన పార్టీ నేతలు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని తెలిస్తే మాత్రం వారిని ఏమీ అనకుండా సిట్ విచారణకు కూడా ఆదేశించేవారు కాదేమో. ఎందుకంటే సిట్ విచారిస్తే సొంత పార్టీ నేతలకు కూడా శిక్ష పడటం ఖాయం. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేయలేదు. ప్రజలకు అన్యాయం చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు చర్యలు తీసుకోవడం మన కళ్ళముందే కనిపిస్తోంది. ఈ ములకలచెరువు ఉన్నది పెద్దిరెడ్డి సోదరుడి ఇలాకాలోనే. అక్కడ అయితే ఎవరూ అడిగే వారు ఉండరు అనే ఉద్దేశంతోనే అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సిట్ విచారణలో చాలా పెద్ద తలకాయలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags

Next Story