టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్!

X
By - TV5 Digital Team |12 Feb 2021 8:15 PM IST
టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది.
టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఈనెల 2వ తేదీన పథకం ప్రకారమే పట్టాభిపై దాడి జరిగింది. ఆయన ఇంటి నుంచి వెళ్లే సమయంలో పక్కాగా రెక్కీ చేసి దాడి చేశారు. ఆ ఎటాక్‌లో దాదాపు 10 మంది పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికి ఆరుగురిని అరెస్టు చేశారు. VIP ఏరియాలోనే ఈ ఎటాక్ జరిగిందంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com