AP : నేటి నుంచి సబ్ రిజస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్

రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి చూడకుండా నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే చాలు. ఇప్పటికే కృష్ణా (D)లో ఈ విధానం పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు అవుతోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. మంత్రి అనగాని సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు.
పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) సిస్టమ్ ద్వారా, రిజిస్ర్టేషన్ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా, అన్ని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదా అవుతుంది. అనధికారిక కార్యకలాపాలు, నకిలీ రిజిస్ర్టేషన్లు తగ్గుతాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాలు తగ్గుతాయి. ఏప్రిల్ 4నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకూ ఈ స్లాట్ బుకింగ్ వ్యవస్థను విస్తరిస్తామని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com