TDP: 'టీడీపీ'నే కావాలంటున్న ఏపీ లీడర్లు.. వరుసగా వలసలు..

TDP (tv5news.in)
TDP: విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు ఎక్కడైనా కనిపిస్తాయి.. కానీ, ఏపీలో సీన్ రివర్స్ అవుతోంది.. అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోకి వలసలు మొదలవడం చర్చనీయాంశం అవుతోంది.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలయ్యాయి.. గుండుగొలనులో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాజకుమారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అంశం చిన్నదే అయినా.. జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. ఏలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ బడేటి చంటి సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.. అధికార పార్టీలో అవమానాలు పెరిగిపోయానని, గ్రామాభివృద్ధికి సహకరించడం లేదని వారంటున్నారు. అంచనాలు, భ్రమలు పటాపంచలయ్యాయని.. గుండుగొలను అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. మరికొంతమంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com