కేంద్రం ఇచ్చిన పథకాలను పేర్లను మార్చడమే రాష్ట్ర ప్రభుత్వం పని : సోమువీర్రాజు

కేంద్రం ఇచ్చిన పథకాలను పేర్లను మార్చడమే రాష్ట్ర ప్రభుత్వం పని : సోమువీర్రాజు

కేంద్రం ఇచ్చిన పథకాల పేర్లను మార్చడమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నపని అని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వమిత్ర పథకం పేరును రాష్ట్ర ప్రభుత్వం పేరుమార్చి వాడుకుంటుందన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 23లక్షల ఇండ్లు ఇచ్చిందని.. వాటిని వాడుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో ఎనిమిది లక్షల ఇళ్లు వెనక్కి పోయాయని సోము వీర్రాజు అన్నారు. ఇండ్లకోసం అధిక ధరలకు భూములు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.


Tags

Next Story