Chandrababu: చంద్రబాబుకు సోనూ సూద్ ఫోన్.. అసెంబ్లీలో జరిగిన ఘటనపై..

Chandrababu: అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానం విషయంలో దాదాపు అందరు టీడీపీ నాయకులు, చంద్రబాబు అభిమానులు స్పందించారు. ఇటీవల ఎన్‌టీఆర్ కుటుంబం కూడా చంద్రబాబుకు మద్దతు తెలియజేశారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ కూడా స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి తన మద్దతును తెలియజేశాడు.
రియల్ హీరో సోనూ సూద్.. చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి అసెంబ్లీలో జరిగిన విషయం గురించి మాట్లాడినట్టు సమాచారం. అసెంబ్లీ లాంటి చోట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అని సోనూ సూద్ అన్నారు. ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. వారి కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదని సోనూ సూద్ చెప్పారు.
చంద్రబాబు, సోనూ సూద్‌కు ఇంతకు ముందు నుండే మంచి సాన్నిహిత్యం ఉంది. చాలాసార్లు చంద్రబాబును సోనూ సూద్ తన ఇన్‌స్పిరేషన్ అని కూడా అన్నారు. ఆయన చేసిన సేవలకు ఎన్నోసార్లు చంద్రబాబును ప్రశంసించారు. అందుకే ఈ ఘటనపై స్పందించి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసిన సోనూ సూద్.. హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా వచ్చి కలుస్తానని తెలిపినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com