12 April 2021 2:21 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తిరుపతి రోడ్ షోలో...

తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి..!

తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి జరిగగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంద్రబాబు పై రాయి విసిరారు.

తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు పై రాయితో దాడి..!
X

తిరుపతి రోడ్‌ షోలో చంద్రబాబుపై రాయితో దాడి చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇది దుర్మార్గపు ప్రభుత్వమంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. ఓటమి భయంతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేతపై రాయితో దాడి చేయడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Next Story