Renu Desai : నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి: రేణూ దేశాయ్

Renu Desai : నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి: రేణూ దేశాయ్
X

భర్త వదిలేశారని తనను దురదృష్టవంతురాలిగా పేర్కొనడం ఎంతో బాధిస్తోందని నటి రేణూ దేశాయ్ ( Renu Desai ) అన్నారు. అందంగా ఉండి, మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్‌లక్కీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాతో ఉన్నవాటితో నేను సంతోషంగా ఉన్నా. లేనివాటి గురించి బాధలేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్స్ సరికాదు. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి వారితో ప్రవర్తించాలి’ అని రిప్లై ఇచ్చారు.

"నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్‌లక్కీ అంటూ కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు వినివినీ నాకు బాధగా ఉంది. అలానే విసిగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు. నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞురాలిని. అలానే లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు. కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళా, పురుషుడు కూడా వాళ్ల పెళ్లి వర్కవుట్ అవనంత మాత్రానా దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు." అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.

Tags

Next Story