AP Minister : రేషన్ బియ్యం రవాణా చేస్తే ఇక చుక్కలే.. మంత్రి నాదేండ్ల కీలక ఆదేశాలు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ తో వివిధ సెక్షన్ల కింద కేసులు పెడతామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు. రూల్స్ పాటిస్తూ చట్టబద్ధంగా బియ్యం ఎగుమతులు చేసేవారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేశారు. ఎగుమతి చేసే బియ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం కలవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి తేల్చిచెప్పారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాదేండ్ల అన్నారు. రాష్ట్రంలోని కీలకమైన కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల వద్ద 24 గంటలు పనిచేసేలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి మరిన్ని చెక్‌పోస్టులను పెంచాలన్నారు. కాకినాడ పోర్టులో నియంత్రణ మెరుగ్గా ఉందని, ఇదే తరహా పటిష్టమైన నిఘాను విశాఖ, నెల్లూరు పోర్టుల వద్ద కూడా అమలు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై కూడా అనుమానం ఉన్నచోట తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com