Subbarao Gupta: అలా చెప్పమన్నది మంత్రి బాలినేని అనుచరుడే: సుబ్బారావు గుప్తా

Subbarao Gupta (tv5news.in)
Subbarao Gupta: పార్టీని ప్రక్షాళన చేస్తే బాగుంటుందనే భావనతోనే ఆ వ్యాఖ్యలు చేశానని, వీటితో టీడీపీకి సంబంధం లేదని వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తా స్పష్టం చేశారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పమంటేనే ఆ వ్యాఖ్యలు చెసినట్లు చెప్పమని తనపై మంత్రిబాలినేని అనుచరుడు శింగరాజు వెంకట్రావు, మరికొందరు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు.
కోటి రూపాయలు ఇచ్చినా అబద్ధాలు మాత్రం చెప్పనని వాళ్ళకు తేల్చి చెప్పానన్నారు. పబ్లిసిటీ కోసమే నేను ఇలా చేస్తున్నానన్న తమ పార్టీ నేతల వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు సుబ్బారావు. తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని పోలీసుల రక్షణ కోరితే.. ఈ ఘటన జరిగి మూడురోజులైనా ఇప్పటివరకు డీఎస్పీ స్పందించలేదని వాపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com