AP : మామిడి రైతులకు సబ్సిడీ.. సీఎం, కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు థ్యాంక్స్

దేశంలో ఎక్కడా లేని విధంగా కిలో మామిడికి రూ.4 సబ్సిడీ ని అందజేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తోతాపూరి మామిడి క్వింటాల్‌కు రూ.1,490 ను కేంద్రం ప్రకటించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మామిడి రైతులకు నష్టం రాకూడదని కిలో మామిడిని రూ.12లకు కొనుగోలు చేశామన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లకు ప్రత్యేక శ్రద్ధ చూపారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు దిగుబడి ఎక్కువ రావడంతో మామిడి ధర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన మంత్రి అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో, పల్ప్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. మామిడి రైతుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని రూ.8 కొనాలని, రూ.4 ప్రభుత్వం సబ్సిడి ఇస్తుందని తెలిపారు. ఇటీవల ఢీల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సబ్సీడి నగదులో 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com