Supreme court : ఏపీలో నిధుల దారి మళ్లింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme court : ఏపీలో నిధుల దారి మళ్లింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను పీడీ ఖాతాలకు మళ్లింపు అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. నిధులు దారి మళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. SDRF నిధుల దారి మళ్లింపును నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై ఏప్రిల్ 28న తదుపరి విచారణ చేపట్టనుంది. అటు.. గతంలో ఇదే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలతో గంటలోపలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరవ్వాల్సి వచ్చింది. మరోవైపు.. కొవిడ్ బాధితులకు నష్టపరిహారంపై ఇప్పటికే ఏపీలో ముగ్గురు సభ్యుల అధికార బృందం క్షేత్రస్థాయి పర్యటన చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com