ACB : జగజ్యోతి సస్పెన్షన్కు రంగం సిద్ధం!

ACB : జగజ్యోతి సస్పెన్షన్కు రంగం సిద్ధం!

ఓ కాంట్రక్టర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని (Jagajyothi) విధుల నుంచి సస్పెండ్ చేసేందుకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధంచేశారు. ఇందుకు సంబంధించి గురువారం నాడు ఏసీబీ రిపోర్ట్ తో పాటు జైలు అధికారుల రిపోర్టులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితురాలు జగజ్యోతిపై శుక్రవారం నాడు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ట్రైబల్ వేల్ఫేర్ ఏఈ జగజ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితురాలిని చంచల్ గుడా జైలుకు తరలించారు. కాగా సోదాలలో దాదాపు రూ. 15 కోట్ల మేరకు ఆస్తులు బయటపడటంతో జగజ్యోతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈక్రమంలో నిందితురాలు కూడబెట్టిన ఆస్తులపై విచారించేందుకు 3 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలావుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జగజ్యోతి అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. రెండు రోజుల పాటు వివిధ వైద్య పరీ క్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో బుధవారం నాడు ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో అధికారులు నిందితురాలు జగజ్యోతిని ఏసీబీ న్యాయస్థానం ముం దు అధికారులు హాజరుపర్చారు.

Tags

Read MoreRead Less
Next Story