TDP: జగన్ ఒక్క ఛాన్స్ అని 5 కోట్ల మందిని మోసం చేశారు

TDP: జగన్ ఒక్క ఛాన్స్ అని 5 కోట్ల మందిని మోసం చేశారు
X
ఒక్క ఛాన్స్ అని 5 కోట్ల మందిని జగన్ మోసం చేశారని ప్రకాశం జిల్లా నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

ఒక్క ఛాన్స్ అని 5 కోట్ల మందిని జగన్ మోసం చేశారని ప్రకాశం జిల్లా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రను ప్రారంభించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలున్నా అందరికీ డబ్బులు వేస్తామన్న జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారని ఆరోపించారు. టీడీపీ తీసుకొచ్చిన రైతులకు సబ్సీడీలను ఎత్తి వేశారని ఫైర్ అయ్యారు. హత్యలు, అత్యాచారాలకు ఏపీని అడ్డాగా మార్చారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాలను కొనసాగిస్తామని బీసీల రక్షణ కోసం బీసీ అట్రాసిట్ చట్టాన్ని అమలు చేస్తామని టీడీపీ నేతలు స్పష్టంచేశారు.

Tags

Next Story